ధన్వాడ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి అయిన చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సోదరుడు వెంకటేశ్వర్ రెడ్డి, నర్సిరెడ్డి సమాధుల వద్ద పూలు తల్లి శ్రద్ధాంజలి ఘటించారు. చిట్టెం నర్సిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.