అమృత్ మహోత్సవ్ ర్యాలీలో పాల్గొన్న యంపిడిఓ

671చూసినవారు
అమృత్ మహోత్సవ్ ర్యాలీలో పాల్గొన్న యంపిడిఓ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శనివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు మువ్వన్నెల జెండాను చేతబట్టి నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి దేశభక్తి చాటారు. ఈ కార్యక్రమంలో యంపిడిఓ సందీప్ కుమార్, యంపిఓ లక్ష్మినరసింహ రాజు, పంచాయతీ కార్యదర్శి రాకేష్ సాగర్, ఉపసర్పంచ్ సిద్దప్ప, శ్రీనివాస్ రెడ్డి, నర్సిములు, బాలప్ప, వినోద్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు జయప్రకాష్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్