కల్వకుర్తి నియోజకవర్గంలోని 8 సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం

55చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గంలోని 8 సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం
కల్వకుర్తి డివిజన్ పరిధిలోని 8 సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు జరుగుతున్న కారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిలిచిపోతుందని తెలిపారు. జాజాల, సిరసనగండ్ల, వెల్దండ, వంగూరు, కల్వకుర్తి వన్ జకినాలపల్లి, మాచర్ల, కాటన్ మిల్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం జరుగుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్