ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని గురువారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రైతు రుణమాఫీ లబ్ధిచేకూరని రైతులు ప్రజాభవన్లో వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైతే అరెస్టులు చేయిస్తారా.? అని ప్రశ్నించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారం దక్కించుకున్న సీఎం రేవంత్ వ్యవహారం పిల్లికి చెలగాటం. రైతులకు ప్రాణ సంకటంల మారిందని ఎద్దేవా చేశారు.