పర్యావరణహితామే లక్ష్యంగా ఓ వస్త్ర దుకాణ యాజమాన్యం గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హానికారక రసాయనాలు, నీటిలో కరిగిపోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివి ఉపయోగించి చేసే గణపతి ప్రతిమల వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని పేర్కొన్నారు.