వనపర్తి జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు నియంత్రణకు మరింతగా కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ కేసులు అరికట్టేందుకు మున్సిపల్, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో మరింత గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు.