జోగులాంబ గద్వాల్ జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. వారి పార్థివ దేహానికి బిజెపి నాయకులు సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి రఘు శ్యాంసుందర్, గ్రామ భూత అధ్యక్షులు జలంధర్ పాల్గొన్నారు.