ఆత్మకూరు మండలం ఊకచెట్టు వాగులో బాట వివాదంతో మంగళవారం వందకు పైగా ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోయాయి. స్థానికుల వివరాలు.. ఊకచెట్టు వాగులో ఇసుక తరలింపుకు ఆత్మకూరు ట్రాక్టర్ల వాళ్లు బాట వేసుకున్నారు. వైశాగాపూర్ టాక్టర్ల వాళ్లు అదే బాటను వాడుకునేందుకు ఆత్మకూరు వాళ్లు అడ్డు చెప్పారు. ఆత్మకూర్ ట్రాక్టర్లను తమ ఊరిమీద వెళ్లకుండా వైశాగాపూర్ వాళ్లు తమ శివారులో అడ్డుకున్నారు. దీంతో వందకు పైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి.