ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

68చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి జిల్లా ఘనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నమోదైన జ్వరం కేసులు, ఎంతమందికి రక్త నమూనాలు సేకరించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో వచ్చే ప్రతి ఒక్కరికీ రక్త నమూనాలు తీసుకొని పరీక్షించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, ఘనపూర్ మండల ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్