వనపర్తి జిల్లా ఐడిఒసి సమావేశ మందిరంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ సంచిత్, నగేష్, జిల్లా ఎస్పీ గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.