వనపర్తి జిల్లా కేంద్రంలోని శారదా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకునికి బుధవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని కోరినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం మండప నిర్వహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.