గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు కడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపురం మండలం శేరిపల్లి సభలో మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రం తెలంగాణను బీఆర్ఎస్ రూ. 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. కొంత ఆలస్యమైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, రాజశేఖర్ రెడ్డి, జె. ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.