భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గంభీర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని పోరాటయోధుడిగా అభివర్ణించాడు. అదే సమయంలో గంభీర్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించాడు. గంభీర్‌తో కలిసి తొలినాళ్లలో ఆడిన రోజులను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.