జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మూవీ 'దేవర'. త్వరలో ఈ మూవీ జపాన్‌లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్ల కోసం తన ఫ్యామిలీతో కలిసి జపాన్ బయల్దేరి వెళ్లారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఆయన అక్కడికి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ విడుదలకానుంది.