వేసవిలో ఆయిల్ పామ్ చెట్ల చుట్టూ పాదులలో ఎండుగడ్డి లేదా పంట అవశేషాలను మల్చింగ్‌గా ఉపయోగించవచ్చు. లేదా తోటల్లో జనుమును నాటుకొని అవి పూత దశలో ఉన్నప్పుడు ముక్కలుగా చేసి పాదులలో వేసుకోవాలి. ఆయిల్ పామ్ ఖాళీ గెలలు, గెలల పించులను మరియు చెట్టు నుంచి తీసిన వ్యర్థ భాగాలను పాదులలో వేయుట వల్ల పాదులలో తేమ ఆరకుండా ఉండటమే కాకుండా అవి కుళ్లీ తిరిగి చెట్టుకు ఎరువుగా ఉపయోగపడతాయి. కొంతవరకు కలుపు కూడా నివారించబడుతుంది.