వేసవికాలంలో అనగా మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా వేసిన ఆయిల్ పామ్ మొక్కలు మరియు ఎండిన చెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ పామ్ మొక్క నాటిన 1 నుంచి మూడేళ్ల వరకు ఎలాంటి మగ, ఆడ పూల గుత్తులను ఉంచకుండా తొలగించాలి. దీనిని అబ్లేషన్ అంటారు. దీనివల్ల చెట్టు మరిన్ని పోషకాలను నిలుపుకొని ఏపుగా పెరుగుతుంది.