TG: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు BRS నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో వెంకటరమణారెడ్డి ప్రమేయం ఉందని మృతుడి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. 'మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. లింగమూర్తి హత్యతో నాకు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. హత్యపై సీఐడీ, సీబీఐతో విచారణ జరిపి దోషులను శిక్షించాలి. మేడిగడ్డ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటాం' అని అన్నారు.