ప్రపంచ దేశాల అంతరిక్ష ప్రయోగాల వల్ల రోదసిలో చెత్త సమస్య తీవ్రతరమవుతున్నది. ఈ వ్యర్థాల వల్ల రోదసి మిషన్స్‌కు ముప్పు ఏర్పడుతుందని తాజాగా వెలువడిన అంతరిక్ష పర్యావరణ నివేదిక-2024 వెల్లడించింది. 40 వేల వస్తువులు రోదసిలో చెత్తగా పేరుకుపోయి ఉన్నాయి. వీటి వల్ల పర్యావరణం దెబ్బతినడం, ఉపగ్రహాలు, వ్యోమ నౌకలను ఢీకొట్టడం వంటివి జరుగుతాయి.