శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో ఇవాళ సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల మధ్య కల్యాణం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకకు హాజరై దేవతామూర్తులకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాల్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ హాజరవుతారు.