IPL-2025లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ పరాజయాలతో SRH చతికిలపడగా, GT మాత్రం రెండు వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్ 'రైజ్' అవ్వాలని SRH ఫ్యాన్స్ కోరుతున్నారు.