AP: ఉత్తర - దక్షిణ ద్రోణి కారణంగా ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో 2 రోజులు వర్షాలు కురిసే అకాశం ఉందని వివరించింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.