ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెలలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. 7వ తేదీన పెదపాడులో రహదారుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 8వ తేదీన అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నాయకులతో స్థానిక సమస్యల గురించి చర్చించనున్నారు.