మార్కెట్ లోకి వన్‌ప్లస్ 12ఆర్‌లో గెన్‌షిన్‌ ఇంపాక్ట్‌ ఎడిషన్‌

62చూసినవారు
మార్కెట్ లోకి వన్‌ప్లస్ 12ఆర్‌లో గెన్‌షిన్‌ ఇంపాక్ట్‌ ఎడిషన్‌
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్.. ఇప్పుడు వన్‌ప్లస్ 12ఆర్‌లో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది జెన్‌షిన్ ఇంపాక్ట్ క్యారెక్టర్ కెకింగ్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో గేమింగ్‌ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపర్చారు. దీన్ని కొనుగోలు చేసిన వారికి కెకింగ్‌ థీమ్‌ కేస్‌తో సహా పలు యాక్సెసరీలతో కూడిన ప్రత్యేక గిఫ్ట్‌బాక్స్‌ లభిస్తుంది. వన్‌ప్లస్‌ 12ఆర్‌ జెన్‌షిన్ ఇంపాక్ట్‌ ఎడిషన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్‌ 14తో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్