ప్రస్తుతం జిరేనియం పంట ఎక్కువగా తెలంగాణ, ఆంధప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఇది మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే బహువార్షిక జాతికి చెందిన మొక్క. ఈ పంట నుంచి లభించే సుగంధ తైలాన్ని ఖరీదైన సబ్బులు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాల తయారీలో విరివిగా వాడుతున్నారు. తద్వారా రైతులు లాభాలను పొందుతున్నారు.