బంగాళదుంపల పెట్టెలో పెద్ద కొండచిలువ (వీడియో)

2224చూసినవారు
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ హోటల్‌లో బంగాళదుంపలు ఉంచిన పెట్టెలో పెద్ద కొండచిలువ దూరింది. దాదాపు 8 అడుగుల పొడవున్న ఆ కొండచిలువను చూసి హోటల్ స్టాఫ్ భయపడ్డారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్‌కు హోటల్ యజమాని సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్