12 ఇన్నింగ్స్‌ల తర్వాత గిల్ సెంచరీ

50చూసినవారు
12 ఇన్నింగ్స్‌ల తర్వాత గిల్ సెంచరీ
పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న గిల్ ఎట్టకేలకు శతకంతో సమాధానం ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒపెనర్లు జైస్వాల్, రోహిత్ అవుటయ్యాక జట్టును గిల్ ఆదుకున్నాడు. 132 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతడి కెరీర్‌లో ఇది మూడో శతకం. 12 ఇన్నింగ్స్‌ల తర్వాత మూడంకెల స్కోరు నమోదు చేశాడు. గతేడాది మార్చిలో ఆసీస్‌తో నాలుగో టెస్టులో చివరిసారిగా శతకం చేశాడు.

సంబంధిత పోస్ట్