రాజస్థాన్‌లో బోరు బావిలో చిక్కుకున్న బాలికను బయటి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బోర్‌వెల్‌లో 5 అడుగుల లోతులో పెద్ద రాయి ఎదురుకావడంతో రాయిని పగలగొట్టి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఏడు రోజులుగా బాలికను రక్షించక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.