'జానకి కలగనలేదు' సీరియల్ తాజా ఎపిసోడ్ లో ఎలాగైనా మళ్లీ కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని జానకి తన భర్తను అడుగుతుంది. అందుకు రామచంద్ర ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేద్దాం అని ఆమెకి ధైర్యం చెబుతాడు. ఉదయం రామచంద్ర, జానకి రాజమండ్రి వెళ్ళాలి అని అనుకుంటారు. రామచంద్ర చాలా తెలివిగా తల్లిని మాటలతో మాయ చేస్తాడు. జానకి మరొక రకమైన కొత్త రకమైన కేకు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది అని రామచంద్ర తన తల్లికి చెబుతాడు. అందుకు తల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామచంద్ర ఎంతో సంతోషంగా జానకిని రాజమండ్రి తీసుకువెళ్లడానికి బయలుదేరుతాడు.
అయితే అదే సమయంలో జ్ఞానాంబ ట్విస్ట్ ఇస్తుంది. జానకిని తనే కేకులు తయారు చేసే బేకరీ దగ్గర వదిలి వస్తానని చెబుతుంది. ఇక జ్ఞానాంబ తీసుకున్న నిర్ణయానికి రామచంద్ర జానకి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇక మధ్యలో జానకి కారు దిగి నేను కాలేజ్ లో ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలని, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తానని చెబుతుంది. కానీ జ్ఞానాంబ తాను కూడా వస్తానని చెప్పడంతో జానకి మరింత టెన్షన్ పడుతుంది. వారు ఒక కాలేజ్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ జానకి చెప్పిన పేరుతో ఎవరు లేరు అని జ్ఞానాంబ తెలుసుకుంటుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధానంగా భయటపడుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.