గోవా ముఖ్యమంత్రి వ్యక్తిగత ఈమెయిల్‌ హ్యాక్‌

69చూసినవారు
గోవా ముఖ్యమంత్రి వ్యక్తిగత ఈమెయిల్‌ హ్యాక్‌
గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత ఈమెయిల్‌ హ్యాక్‌ అయినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. గోవా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దానిని నాలుగైదు గంటల్లోనే పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో హ్యాకర్‌ను గుర్తించే దిశగా పోలీసుల ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నవంబర్ 19 రాత్రి ఈ హ్యాకింగ్ జరిగిందని.. దీని వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్