ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా ప్రకృతి వింతగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక చెట్టు పచ్చని ఆకులతో నిండి కనిపిస్తుంది. అయితే ఒక కాండం నుంచి ఒక ఆకు వేలాడుతూ ఉంది. అయితే ఆ ఆకు ఓం కార రూపంలో ఉన్న వినాయకుడి దివ్వరూపం.. దీంతో వినాయక చవితి వేళ పరవశించిన ప్రకృతి.. ఒక ఆకు వినాయక రూపం దాల్చింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.