ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సరదాగా సంభాషించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచ, కండువా ధరించి హాజరయ్యారు. దాంతో పవన్ ఆహార్యాన్ని చూసిన ప్రధాని మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా పవన్? అని ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్న ఎన్డీయే నేతలంతా చిరునవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.