కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన కింద ఇచ్చే కనీస పెన్షన్‌ను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెన్షన్‌ను రూ.10వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్ని పనులు పూర్తయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025 లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్. దీని ద్వారా చందాదారులకు కాస్త ఆర్థిక స్థిరత్వం, భద్రత ఏర్పడుతుందని ఓ ప్రభుత్వాధికారి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.