రైతు భరోసా, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు

85చూసినవారు
రైతు భరోసా, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లా మానుకొండూరు 'అలయ్ బలయ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్యారంటీ పేరుతో రేవంత్ సర్కారు గారడీ చేస్తోందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలులో విఫలమైందన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక రేవంత్ పై పోరాటానికి అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్