తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డిగా పేరు మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు.