మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ కేటీఆర్ కు నోటిసులు ఇచ్చి విచారించనుంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కుంభకోణం జరిగిందని, నిధుల దుర్వినియోగం చేశారని ప్రభుత్వం గుర్తించింది. కుంభకోణం నిజమని తేలితే కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.