దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట, సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.