GREAT: 10 సార్లు MLAగా పోటీ.. 7 సార్లు గెలిచాడు

61చూసినవారు
GREAT: 10 సార్లు MLAగా పోటీ.. 7 సార్లు గెలిచాడు
ఏపీలో కూటమి భారీ విజయాలతో దూసుకుపోతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి పి. ఉమాశంకర్‌ గణేష్‌‌పై 23,860కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అయ్యన్న.. ఇప్పటి వరకు 10 సార్లు MLAగా పోటీ చేశారు. 7 సార్లు గెలుపొందారు. గత ఎన్నికల్లో YCP అభ్యర్థి గణేష్ చేతిలో 22,839 ఓట్ల తేడాతో అయ్యన్న ఓటమిపాలయ్యారు.

సంబంధిత పోస్ట్