వేరుశనగ సాగు.. సస్యరక్షణతో బాగు
By Potnuru 65చూసినవారువేరుశనగ పంటకు వేరు పురుగు, ఎర్ర గొంగళి, తామరపురుగు, పేనుబంక, పచ్చ పురుగు ఆకు ముడత, లద్దె పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. ఎర్రగొంగళి పురుగు నివారణకు లీటరు నీటికి డైమిధోయేట్ 2 మి.లీ లేక, మోనో క్రోటోఫాస్ 1.6 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వేరుపురుగు నివారణకు ఫోరేటు 10 శాతం గుళికలు ఎకరాకు 6 కిలోల చొప్పున గింజ విత్తే సమయంలో వేసుకోవాలి. ఆకు ముడత నివారణకు క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.