అరకు ఎస్టీ రిజర్వుడ్ సీటు. ఇది భౌగోళికంగా పెద్ద నియోజకవర్గం. పాలకొండ నుంచి రంపచోడవరం వరకూ అరకు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6 ఎస్టీ రిజర్వుడ్ కాగా, ఒకటి (పార్వతీపురం) ఎస్సీ రిజర్వుడ్ స్థానం. 2014లో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో 'నోటా'కి 16,562 ఓట్లు రాగా, అది 2019 లో 47,977 వేలకు పెరిగింది. ఇది పాలకులపై ఓటర్లకున్న అసంతృప్తిని తెలియజేస్తోంది.