కరాచీ బేకరీలో ఎక్స్‌పైరీ బిస్కెట్లు, చాక్లెట్ కేకులు

65చూసినవారు
కరాచీ బేకరీలో ఎక్స్‌పైరీ బిస్కెట్లు, చాక్లెట్ కేకులు
హైదరాబాద్‌లో ప్రసిద్ది చెందిన కరాచీ బేకరీలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను గుర్తించారు. రూ.5,200 విలువైన రస్క్‌లు, బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, టోస్ట్‌లు, బన్స్‌ గడువు ముగిసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అనేక లేబుల్ లేని ఉత్పత్తులను కనుగొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్