ఆ ఖర్చులు పేరెంట్స్‌ భరించాలి: హైకోర్టు

53చూసినవారు
ఆ ఖర్చులు పేరెంట్స్‌ భరించాలి: హైకోర్టు
ఏసీ కోసం ఓ ప్రైవేట్‌ స్కూల్‌ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి క్లాస్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యం కోసం నెలకు రూ.2000 వసూలు చేస్తున్నారని ఆ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇలాంటి ఖర్చులు తల్లిదండ్రులే భరించాలని సూచించింది.