ట్రైన్లలో ‘హలాల్ ఫుడ్’ ప్రచారం ఫేక్: ఐఆర్సీటీసీ

57చూసినవారు
ట్రైన్లలో ‘హలాల్ ఫుడ్’ ప్రచారం ఫేక్: ఐఆర్సీటీసీ
హలాల్ గుర్తింపు పొందిన ఉత్పత్తులను రైల్వేశాఖ ప్రయాణికులకు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారంపై ఐఆర్సీటీసీ స్పందించింది. ఎవరూ దీన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ఫుడ్ సప్లయ్ కోసం తమకు కేవలం ఎఫ్ఎస్ఎస్ఏఐ సమ్మతి మాత్రమే అవసరమని స్పష్టం చేసింది. హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులను తనకు సప్లయ్ చేశారంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరలవగా ఐఆర్సీటీసీ ఇలా స్పందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్