పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్లను నరకడం తేలిక.. పెంచడమే కష్టమని చెప్పారు. చిన్న పిల్లలతో వన మహోత్సవంలో ప్రతిజ్ఞ చేయించడం అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జూన్‌లో ప్రారంభమై నవంబర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. చెట్ల గురించి చిన్నప్పుడు చదువుకున్న పాఠాన్ని గుర్తు చేసుకున్నారు.