టెట్‌ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ కు హరీశ్‌రావు లేఖ

82చూసినవారు
టెట్‌ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ కు హరీశ్‌రావు లేఖ
సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం సంచలన లేఖ రాశారు. ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడంపై ఫైర్ అయ్యారు. 'విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది రెండు పేపర్లకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు' అని లేఖలో పేర్కొన్నారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్