బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమా మే 1 ప్రేక్షకుల ముందుకు రానుంది.