అరెస్టుకి కూడా మంచి ముహూర్తం పెట్టుకున్న హెచ్‌డీ రేవణ్ణ

64చూసినవారు
అరెస్టుకి కూడా మంచి ముహూర్తం పెట్టుకున్న హెచ్‌డీ రేవణ్ణ
మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే ఎంతో నమ్మకం. ప్రతి పనికీ ముహూర్తం, రాహుకాలం, యమగండ కాలాన్ని చూసుకుంటారు. ఆయనను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు సాయంత్రం 5.15కు వచ్చారు. అయితే సాయంత్రం 6.50 వరకు సరైన సమయం కాదని, ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు రేవణ్ణ. సాయంత్రం 6.50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోయారు.