ప్యాంటులో పాముల అక్రమ రవాణా

1093చూసినవారు
ప్యాంటులో పాముల అక్రమ రవాణా
ప్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న 2 పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. గత నెల 26న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని ఫ్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో పాములను గుర్తించినట్లు వెల్లడించింది. వాటిని ఫ్లోరిడా వన్యప్రాణి సంరక్షణ కమిషన్‌కు అప్పగించామని అధికారులు తెలిపారు.