బస్టాప్‌లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్‌‌పాస్‌

61చూసినవారు
బస్టాప్‌లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్‌‌పాస్‌
తెలంగాణలోని కరీంనగర్‌ బస్‌‌స్టేషన్‌ ఆవరణలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌ పాస్‌ను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ అందజేసింది. స్థానిక ఆస్పత్రిలో కుటుంబసభ్యులను ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారుల బృందం శనివారం కలిసింది. ఆడపిల్లకు బస్‌‌పాస్‌‌తో పాటు వారికి రూ.14 వేల ఆర్థిక సాయం, వస్త్రాలను అందజేసింది.

సంబంధిత పోస్ట్