వైసీపీకి ఓటు వేసిందని తల్లినే చంపాడు

58790చూసినవారు
వైసీపీకి ఓటు వేసిందని తల్లినే చంపాడు
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డె వెంకటేశులు టీడీపీలో ఉన్నాడు. తల్లి వడ్డె సుంకమ్మ (45) వైసీపీకి ఓటు వేసినట్లు చెప్పింది. కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి తల్లితో గొడవకు దిగాడు. తల్లి తలపై సుత్తితో కొట్టి చంపి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై సుంకమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్