వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును పెంచుతాయి. నీటిలో నానబెట్టిన వాల్ నట్స్‌ను తింటుంటే రోజంతా మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు నట్స్‌ను కచ్చితంగా తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ నట్స్‌ను రోజూ తింటుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌పై పోరాటం చేస్తాయి.